నిరుద్యోగులను మోసం చేసిన ఫ్రైడే కన్సల్టేషన్ కంపెని
17-08-2024 06:19 PM
హైదరాబాద్: మాదాపూర్ లో నిరుద్యోగులను ఫ్రైడే కన్సల్టేషన్ కంపెని మోసం చేసింది. మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని 100 ఫీట్ రోడ్ లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దాదాపు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు వెల్లడించారు.
నిరుద్యోగులకు ఉద్యోగం పేరుతో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేసిన కంపెని ప్రతినిధులు డబ్బులు వసూలు చేసిన బోర్డు తిప్సేశారు. నిరుద్యోగుల నుంచి మొత్తం రూ.కోట్లు వసూలు చేసి కంపెని ప్రతినిధులు పరారైన్నట్లు బాధితులు పేర్కొన్నారు. తము మోస పోయామని తెలుసుకున్న బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.






