11 July, 2026 | 11:42 PM

నేను తెలుగు ప్రజల కోసం పని చేస్తా: చంద్రబాబు

07-07-2024 02:10 PM

హైదరాబాద్: విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేనే లేఖ రాసానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారి చెప్పారు.

తెలుగు వారు ఐకమత్యంగా ఉండాలి.. రెండు రాష్ట్రాలు వేరైనా, ఎవరి పాలన వారిదైనా, ఎవరైనా మన తెలుగు వారి జోలికి వస్తే మాత్రం, మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొంత మంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలన్నారు.

తాను ఆంధ్రా, తెలంగాణ అని కాకుండా తెలుగు ప్రజల కోసం పని చేస్తానన్న చంద్రబాబు.. కొంత మంది గొడవలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు.. గొడవలు పడితే నీళ్లు రావు, ఇబ్బందులు ఎదుర్కోవాలన్నారు. కలిసి చర్చించుకుంటే అన్ని సమస్యలు తీరుతాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది.. కానీ సమస్యలు వస్తే సమన్వయం చేసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.