11 July, 2026 | 10:37 PM

జగన్నాథుడికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

07-07-2024 02:20 PM

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమాన స్వేచ్ఛ, అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గరలోని ఇస్కాన్ దేవాలయం జగన్నాథ రథయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “మేము మత సామరస్యాన్ని కొనసాగిస్తాము, అనుసరిస్తాము” అని అన్నారు. ఇస్కాన్ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిందని, మానవాళికి సేవ- భగవంతుని సేవ అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. “ఇస్కాన్ ప్రార్థనల ద్వారా, రాష్ట్రాన్ని శాంతి, సామరస్యాలతో ఆశీర్వదించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.