ఏపీ, తెలంగాణ నా రెండు కళ్లు: చంద్రబాబు
07-07-2024 12:53 PM
హైదరాబాద్: పార్టీ శ్రేణుల అభిమానం చూస్తుంటే తనకు ఉత్సాహం వస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ శ్రేణులు ఏపీలో తన విజయానికి పరోక్షంగా కృషి చేశారని చెప్పారు. తెంలగాణ టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ గడ్డపైన టీడీపీ పార్టీకి మళ్లీ పునర్ వైభవం వస్తుందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని బాబు పేర్కొన్నారు. నాలుగోసారి ప్రమాణం చేశాక తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చానని ఆయన వెల్లడించారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చానని సూచించారు.






