టీవీలో చూసి గర్వపడ్డా.. నా జన్మ ధన్యమైంది
నన్ను ఏ కారణం లేకుండానే జైల్లో పెట్టారు
తెలంగాణ గడ్డపైన టీడీపీ పార్టీకి మళ్లీ పునర్ వైభవం
హైదరాబాద్: తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అన్నారు. తెలుగు జాతి అనేక సంక్షోభాలు ఎదుర్కోందన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొందని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటూ టీడీపీ ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. తనను ఏ కారణం లేకుండానే జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్ వాసులు చేసిన ఆందోళన, తనకు మద్దతుగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభ తాను మరిచిపోలేనన్నారు. హైదరాబాద్ లో తనకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడ్డానని పేర్కొన్నారు. హైదరాబాద్ లో తనకు మద్దుతగా నిర్వహించిన ఆందోళనలు చూసి తన జన్మధన్యమైందని అనిపించిదని సీఎం చంద్రబాబు తెలిపారు.






