10 May, 2026 | 10:44 AM

నారా దేవాన్ష్ పై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు

27-01-2025 04:11 PM

హైదరాబాద్: చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(N. Chandrababu Naidu) మనవడు నారా దేవాన్ష్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. నారా దేవాన్ష్(Nara Devansh) ఇటీవల 175 చెస్ పజిల్స్‌ను కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో పూర్తి చేయడంతో అతనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి పెట్టింది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన దేవాన్స్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను'' ఉప ముఖ్యమంత్రి కార్యాలయం (DCMO) కూడా నారా దేవాన్ష్ రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన వీడియోను సోషల్ మీడియా ఎక్స్ లో పంచుకుంది.