25 June, 2026 | 1:32 AM

ఏపీ షూటింగ్ చాంపియన్‌షిప్ విజేతలకు సన్మానం

25-06-2026 12:00 AM

పతకాలు అందజేసిన సలలిత్ తోట్టెంపూడి, రవి కృష్ణ ఐపీఎస్

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఆర్‌ఏఏపీ) ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని సాట్స్ షూటింగ్ రేంజ్‌లో నిర్వహిస్తున్న 26వ ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిర్, స్మాల్ బోర్, షాట్‌గన్ షూటింగ్ పోటీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ వ యో విభాగాలకు చెందిన షూటర్లు ఈ పోటీ ల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.10 మీట ర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 216 మంది క్రీడాకారులు, ట్రాప్, స్కీట్ విభాగాల్లో 12 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఆకట్టుకున్నారు. ఈ చాంపియన్‌షిప్ తొలి బ హుమతి ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం గచ్చిబౌలిలోని సాట్స్ షూటింగ్ రేం జ్‌ల్లోని 25 మీటర్ల రేంజ్‌లో ఘనంగా జరిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, ట్రాప్, స్కీ ట్ విభాగాల విజేతలకు పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) గవర్నింగ్ బాడీ సభ్యుడు సలలిత్ తోట్టెంపూడి, గౌరవ అతిథిగా ఈగల్ టీమ్ ఇన్‌స్పె క్టర్ జనరల్ రవి కృష్ణ, ఐపీఎస్ హాజరయ్యా రు. 

సలలిత్ తోట్టెంపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో షూటింగ్ క్రీడలపై పెరుగుతున్న ఆసక్తి సంతోషకరమని, క్రీడాకారులు మరిం త కృషి చేసి జాతీయ స్థాయి లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ పోటీ ల్లో పెదపాటి సాయి శ్రీరామ్ మూడు స్వర్ణ, ఒక రజతతో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారుడిగా నిలిచాడు. చార్లెస్ దీక్షిత ప్రియా రెండు స్వర్ణ పతకాలు గెలుచుకోగా, దీక్షిత నెట్టి ఒక స్వర్ణం, మూడు రజత పతకా లు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.

అలాగే 50 మీటర్ల రైఫిల్, 50 మీటర్ల ఓపెన్ సైట్ రైఫిల్, 50 మీటర్ల ఓపెన్ సైట్ మూడు -పొజిషన్ విభాగాల పోటీలు కూడా ముగియగా, ఆ విభాగాల విజేతలను  అభినందించారు. మి గిలిన 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ (పురుషులు, మహిళలు), డబుల్ ట్రాప్, 10 మీట ర్ల ఎయిర్ రైఫిల్, ఓ పెన్ సైట్ రైఫిల్, 25 మీటర్ల పిస్టల్, 50 మీటర్ల పిస్టల్ పోటీలు కొనసాగనున్నాయి. తదుపరి బ హుమతి ప్రదానోత్సవం గురువారం సా యంత్రం నిర్వహించనున్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది.