25 June, 2026 | 1:30 AM

పాఠ్య, నోట్ పుస్తకాలు సీజ్

25-06-2026 12:00 AM
  1. అనుమతులు లేకుండా విక్రయిస్తున్న వ్యక్తి
  2. ముల్కనూరులోని ఓ ఇంటిలో అధికారుల తనిఖీలు

భీమదేవరపల్లి, జూన్ 24 (విజయక్రాంతి) : హనుమకొండ జిల్లా భీమదేవర పల్లి మండలం ముల్కనూరులో ఒకరి ఇం ట్లో ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను విద్యాశాఖ అధికా రులు బుధవారం సీజ్ చేశారు.

ముల్కనూర్ లో ఒకరి ఇంట్లో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు గోదామ్‌గా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుం డా ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సీలు చెల్లించకుండా విక్రయిస్తున్న వారిపై యుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల మనోజ్, మాలోత్ రాజేష్ నాయక్ మండల విద్యాధికారి సునీతకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భీమదేవరపల్లి మండల విద్యాధికారి సునీత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నోటు పుస్తకాలు, బుక్కులు ఉన్న గోదామ్‌ను పరిశీలించి సీజ్ చేశారు. జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలను విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.