calender_icon.png 24 December, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ నచ్చేలా అప్నీ హద్ సే

24-12-2025 12:00:00 AM

మహమ్మద్ నజీ ర్, రిఫత్ రజూర్ జం టగా నటించిన మెలోడియస్ మ్యూజిక్ వీడియో ‘అప్నీ హద్ సే’. బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అభయ్ జోధ్‌పుర్కర్ ఈ పాటను ఆలపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సాంగ్ లాంచ్ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. యువ ప్రతిభను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని, సౌత్‌లో హిందీ సినిమా చేయటం చాలా మంచి పరిణామం ఎమ్మెల్యే అన్నారు. నటుడు మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ.. “మా ‘అప్నీ హద్ సే’ సాంగ్ అభయ్ జోధ్‌పుర్కర్ వంటి గొప్ప సింగర్ మా పాట పాడటం మాకు గర్వకారణం. ప్రేక్షకులకు ఈ పాట కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నా” అని తెలిపారు.