24-12-2025 12:00:00 AM
స్టార్ హీరో విజయ్ దేవరకొండ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్న క్రేజీ చిత్రం ‘రౌడీ జనార్దన’. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు రవి కిరణ్ కోలా రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “ఈ స్టోరీ విన్నప్పుడు నాకు యూనిక్‌గా అనిపించింది. విజయ్ ఇప్పటిదాకా ఇంత మాస్, బ్లడ్‌షెడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు.
ఔట్‌అండ్‌ఔట్ మాస్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించబోతున్నాం. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్‌కు తీసుకొస్తాం” అన్నారు. డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ.. “ఈ కథ చెప్పిన కొద్దిసేపటికే విజయ్ ఆ క్యారెక్టర్‌లా మాట్లాడటం, చెప్పే సీన్‌కు రౌడీ జనార్దనలా రియాక్ట్ అవడం మొదలుపెట్టాడు. వర్క్ షాప్స్ అన్నీ చేసి ఫస్ట్ డే షూట్ కోసం సెట్ రెడీ చేస్తున్నాం. 8 నిమిషాల లాంగ్ సీన్ చేయాలి. ఆ ముందు రోజే విజయ్ సెట్‌లోకి వచ్చి ఆ డైలాగ్స్ మొత్తం చెప్పేస్తున్నాడు.
అప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది. ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ చాలా ఆక్యురేట్‌గా డైలాగ్స్ చెబుతున్నారు. నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి సరిగ్గా మాట్లాడుతున్నారా.. లేదా? అనేది తెలిసిపోతుంది. కథ ఎంత బాగుందో, గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం అంతే బాగుందని దిల్ రాజు అనేవారు. డైలాగ్స్ ఫ్లేవర్ అలాగే రావాలని విజయ్, దిల్ రాజు పర్టిక్యులర్‌గా ఉండేవారు” అన్నా రు. కార్యక్రమంలో డీవోపీ ఆనంద్ సీ చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ పాల్గొన్నారు.