23-12-2025 12:52:09 PM
బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడు
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ(Criminal Investigation Department) దూకుడు పెంచింది. సెలబ్రిటీల విచారణ వేగంగా సాగుతోంది. బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మి(Manchu Lakshmi ) సీఐడీ విచారణకు హాజరయ్యారు. లక్డీకపూల్ లోని సీఐడీ కార్యాలయంలో మంచు లక్ష్మి విచారణకు హాజరయ్యారు. మంచు లక్ష్మితో పాటు బయ్యా సన్నీ యాదవ్, రీతూ చౌదరి విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే పలువురు నటులను సీఐడీ ప్రశ్నించింది.