ప్రజలతో మమేకం.. పాలనలో పారదర్శకత
లంచాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
మీట్ ది ప్రెస్‌లో చైర్ పర్సన్ అప్పల కావ్య
నిర్మల్ ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. చారిత్రాత్మక సంపదను పరిరక్షించుకుంటూ మున్సిపాలిటీలో అవినీతి లేకుండా ప్రజలతో మమేకమై పారదర్శక పాలన అందిస్తా మని మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి ప్రకటించారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మేడిది ప్రెస్లో పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని విభాగాల్లో ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తామన్నారు.
మున్సిపల్ లో అవినీతి అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తప్పమన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రతిరోజు సిద్ధమైన జలం సరఫరా విద్యుత్ ట్రాఫిక్ సమస్య. ప్రతి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. పట్టణంలో రద్దు చేయడం జరిగిందని త్వరలో కొత్త మున్సిపల్ భవనం పరిపాలన కొనసాగిస్తామని తెలిపారు. అరులని వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజలకు ఏ అవసరాలు అవసరము ప్రజల ద్వారా అభిప్రాయ సేకరించి వాటిని సమకూర్చవలసిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తమపై విశ్వాసం ఉంచి అధికార పగ్గాలను ఇచ్చిన ప్రజలకు వారి మౌలిక సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత తమదేనని తెలిపారు. ఈ కారక మండలం స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం
నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య వైస్ చైర్మన్గా గణేష్ చక్రవర్తి ఎన్నిక కావడంతో నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వారిని సన్మానం చేశారు. ఈ పట్టణ అభివృద్ధికి మీడియా అన్ని విధాల సహకారం అందించాలని తెలిపారు కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాసం శ్రీధర్ లక్ష్మణ్ పాత్రికేయులు పాల్గొన్నారు.




