Breaking News

మద్యం మత్తులో ‘నీట్ పీజీ’ పరీక్షకు..

31-08-2026 | 12:34am

విద్యార్థిని అదుపులోకి తీసుకున్న సిబ్బంది 

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శేరిగూడలోని నీట్ పీజీ పరీక్షా కేంద్రానికి హైదరాబాద్కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అనే విద్యార్థి మద్యం తాగి హాజరయ్యాడు. పరీక్ష హాల్లో అతని ప్రవర్తన తేడాగా ఉండటంతో గమనించిన ఇన్విజిలేటర్లు, అధికారులు అతడిని తనిఖీ చేసి మద్యం సేవించినట్లు నిర్ధారించారు. వెంటనే అతడిని పరీక్ష రాయకుండా కేంద్రం నుంచి అభ్యర్థి ని బయటకు పంపించారు.

మరిన్ని వార్తలు