ఆధ్యాత్మికతను చాటేలా లేజర్ షో
- అలంపూర్ ఆలయాలకు ఆధ్యాత్మిక ప్రాశస్త్యం
- పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
- లేజర్ షోను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు
అలంపూర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఐదో శక్తిపీఠం అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్ అండ్ లేజర్‌షోను కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి, ఎమ్మెల్యే విజేయుడుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అలంపూర్ ఆలయాలకు ఎంతో గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందన్నారు.
ఆల యాల చరిత్ర, సంస్కృతి, హిందూ ధర్మ విశిష్టతను ఆధునిక సాంకేతికతతో ప్రజలకు వివరించేందుకు సౌండ్ అండ్ లైట్ షో ఉపయోగపడుతుందని తెలిపారు. అలంపూర్ క్షేత్రానికి దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు క్షేత్రం విశిష్టతను మరింతగా ప్రచారం చే యాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసాద్ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో అలంపూర్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
ఇలాంటి కార్యక్రమాలు మన వారసత్వ సంపదను కాపాడుకోవడం తో పాటు భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని అన్నారు. అంతకుముం దు కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు బొకే అందించి స్వాగ తం పలికి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ స్కీమ్ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.






