31 August, 2026 | 2:14 AM

ప్రజల చూపు టీఆర్పీ వైపు

31-08-2026 01:07 AM
  1. మూడుపార్టీలపై నమ్మకం కోల్పోయిన ప్రజలు
  2. గడప గడపకు చేరుకునేలా సెప్టెంబర్ 17 నుంచి మల్లన్న పాదయాత్ర
  3. 90 శాతం జిల్లా కమిటీల ఎంపిక పూర్తి
  4. మండలాలు, గ్రామాల్లో పూర్తిచేయాలని నాయకులకు సూచన
  5. మల్లన్న అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి): రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ప్రస్తుతం ప్రజలందరి చూపు తెలంగాణ రా జ్యాధికార పార్టీ (టీఆర్పీ) వైపే ఉందని అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆ దివారం పార్టీ కార్యాలయంలో మల్లన్న అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్ సమావేశంలోని ఎజెండాను ప్రవేశపెట్టారు.

సెప్టెంబర్ 17నాటికి పార్టీ ఏర్పడి సంవత్స రం పూర్తవుతున్న సందర్భంగా ప్లీనరీ నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. సెప్టెంబర్ 17 నుంచి మల్లన్న చేపట్టనున్న పాదయాత్రపై చర్చించి పలు నిర్ణయాలను తీసుకున్నారు. గ్రామ గ్రామాన ప్రజలను చై తన్యం చేయాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలను, మోసాలను ప్రతీ ఇంటికి వి వరించి రాజకీయ మోసాలను ఎండగట్టాల ని నిర్ణయించారు. బీసీలకు రాజ్యాధికారం దక్కేవరకు విశ్రమించకూడదని సమావేశం లో నిర్ణయించినట్లు మల్లన్న పేర్కొన్నారు.

జిల్లా కమిటీల ఏర్పాటు దాదాపు 90 శాతం పూర్తయ్యిందని, మండల, గ్రామస్థాయి కమిటీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల ని మల్లన్న పార్టీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శు లు లింగాల గంగాధర్, మదన్ మోహన్ చా రి, ఆర్ భావన వెంకటేష్, పల్లెబోయిన అశో క్ ముదిరాజ్, జ్యోతి పండల్, కోశాధికారి కొక్కలకొండ మనోజ్, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ఆకుల హనుమాన్లు,

కోమల మంజుల గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, మైనారిటీ అ ధ్యక్షుడు సల్మాన్, సోషల్ మీడియా కన్వీనర్ మనోజ్ ఆకుల, రాష్ట్ర కార్యదర్శులు రమేష్ యాదవ్, నగేష్ ముదిరాజ్,అఖిల్ పాషా, కడారి శ్రీనివాస్, గట్ల రాజన్న, సహాయ కా ర్యదర్శులు ఐలయ్య యాదవ్, బిక్షపతి గౌడ్ రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పిడికెడు ఓట్లతో వెలమల పెత్తనం..

బీసీలు అత్యధిక సంఖ్యలో రాష్ట్ర రాజకీయాల్లో వారికి అధికారం మాత్రం పరిమి తంగానే ఉందని,అధికార పదవులు మాత్రం వెలమ సామాజిక వర్గానికే దక్కుతున్నాయని గణాంకాలతో సహా తీన్మార్ మల్లన్న వివరించారు. జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం 2,31,513 మంది ఓటర్లుండగా, అందులో 1,64,674 మంది బీసీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కేవలం 2,006 మంది మాత్రమే ఉన్నారని, సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 2,33,840 మంది ఓటర్లలో 1,53,201 మంది బీసీలు ఉన్నారని,

వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కేవలం 427 మంది మాత్రమే ఉన్నారని, పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 2,54,530 మం ది ఓటర్లలో 1,73,643 మంది బీసీలు ఉన్నారని ఇక్కడ కూడా నిర్ణయాధికారం వెలమల దే అని, సిరిసిల్ల నియోజకవర్గంలో సుమా రు 1.58 లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నార ని, వెలమ ఓటర్లు కేవలం 2,840 మంది మాత్రమే ఉన్నారని దీంతో బీసీల నాయకత్వాన్ని, వారి రాజకీయ అవకాశాలను, అధి కారాలను దోచుకుంటున్నది వెలమలే అని స్పష్టం అవుతుందన్నారు.

రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిపి 90 శాతానికిపైనే ఉన్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మం త్రులు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి పదవు ల్లో వారి పాత్ర పరిమితమేనన్నారు. ఈ పరిస్థితిని మార్చడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని మల్లన్న స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని, బీసీ యువత, మేధావులు, సామాజిక ఉద్యమకారులు త మతో కలిసిరావాలని మల్లన్న పిలుపునిచ్చారు.