24 February, 2026 | 9:48 PM

ఏపీలోనూ ఆపిల్స్

18-11-2025 12:45 AM
  1. లంబసింగి, చింతపల్లి, అరకు కొండల్లో సాగు
  2. పంచగవ్వ, జీవామృతం పద్ధతుల్లో మొక్కల పెంపకం
  3. హైదరాబాద్‌లోని సీసీఎంబీ కీలక పాత్ర
  4. భవిష్యత్‌లో జాతీయ బ్రాండ్‌గా మన్యం ఆపిల్!

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : శీతల ప్రాంతంలోనే సాగుకు అనుకూలంగా ఉండే ఆపిల్స్ పంట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించనున్నది. గిరిజన పాంత్రాలైన లంబసింగి, చింతపల్లి, అరకు కొండల్లో కొత్తగా ఆపి ల్స్ సాగు కొత్తవరవడి సృష్టిస్తోంది. పంచగవ్వ, జీవామృతం వంటి సహజ పద్ధతు ల్లో మొక్కలను పెంచుతున్నారు. తీపి కొద్దిగా తక్కువైనా పండ్ల నాణ్యత మాత్రం అద్భుతంగా ఉంటుందని రైతు లు చెప్తున్నారు.

ఇక్కడ సాగు సాధ్యంలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ కీలక పాత్ర పోషించింది. భవిష్యత్‌లో జాతీయ బ్రాం డ్‌గా మన్యం ఆపిల్స్ మారుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్, కాశ్మీర్ లాంటి చల్ల ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమ య్యే ఆపిల్ తోటలు ఇప్పుడు దక్షిణాదికి కూడా విస్తరిస్తున్నాయి. వాస్తవానికి లంబసింగి, చింతపల్లి, అరకు ప్రాంతాలు స్ట్రాబెర్రీ సాగుకు స్వర్గధామంగా పేరొందింది.

తాజాగా ఆంధ్రా ఆపిల్స్‌కు కూడా నిలయంగా మారుతోంది. అయితే ఏపీలో ఆపిల్స్ సాగు సాధ్యం కావడం తో హైదరాబాద్‌లోని సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ సెంటర్(సీసీఎంబీ) కీలక పాత్ర పోషించింది. సీసీ ఎంబీ పరిశోధనలో భాగంగా ఈస్ట్రన్ ఘాట్స్ వాతావరణాన్ని హిమాలయ ప్రాంతాలతో పోల్చిగా ఇక్కడి శీతాకాల ఉష్ణోగ్రతలు కూడా సున్నాకి పడిపోవడం ఆపిల్ సాగుకు అనుకూలమని నిర్ధారించారు.

పలు స్పష్టమైన వాతావరణ అధ్యయ నాల తర్వాత సీసీఎంబీ, ఐటీడీఏ పాడేరు, గిరిజన వికాస్ వంటి సంస్థలు కలిసి లంబసింగి, కట్టుపల్లి, గూడెం కోతవీధి, మాడెం గ్రామాల్లో ఆపిల్ మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టాయి. ఆపిల్ పండించాలను కున్న రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో మంచి ఫలితాలు వచ్చాయి. 

ఏటా రెండు పంటలు..

కొండల మధ్య ఏడాదంతా కొనసాగే సా గునీటి సదుపాయంతో డ్రిప్ ఇరిగేషన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ఏటా కొన్ని రోజులు 5 నుంచి 10 సెంటీ గ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆపిల్ పెరుగుద లకు అత్యంత అనుకూలంగా మారుతుంది. డిసెంబర్, మే నెలల్లో సంవత్సరానికి రెండు సార్లు పంట కోతకు వస్తుంది. పంటను కోసిన నాలుగు రోజుల వరకు పండ్లు ఎం తో తాజాగా ఉంటాయి. అయితే మూడెకరా ల చొప్పున భూమి కలిగిన గిరిజన కుటుంబాలు కాఫీ, మిరియాలు, పసుపుతోపాటు ఇప్పుడు ఆపిల్స్‌ను కూడా సాగు చేస్తున్నారు.

దీంతో వారికి ఆదాయం మరింత పెరుగుతుంది. దీనికితోడు ఒక ఆపిల్ చెట్టు 150 పండ్ల దిగుబడిని ఇస్తున్నది. ఏపీలోనూ ఆపిల్స్ సాగుకు అనుకూల వాతావరణం ఉండటంతో ప్రస్తుతం దక్షిణాది ఆపిల్ బ్రాం డ్‌గా మన్యం ఆపిల్స్ నిలుస్తుంది. తూర్పు ఘాట్ కొండల్లో సాగు విస్తరిస్తుండటంతో భవిష్యత్‌లో మన్యం ఆపిల్ కూడా షిమ్లా, కశ్మీర్ లాగా జాతీయ బ్రాండ్‌గా నిలిచే రోజు దూరంలో లేదని నిపుణులు భావిస్తున్నారు.

మూడేళ్లలో అందుబాటులోకి ఆపిల్స్..

‘అందరూ ఒకే పంట వేస్తే మార్పు రాదు. ఇతరులు వేయలేని పంట వేసినప్పుడు విలువ పెరుగుతుంది’ అనే సందేశంతో ప్రా రంభమైన ఈ ప్రయోగం విజయవంతమైం ది. మూడేళ్లకే మొదటి సారి ఆపిల్ పంట చేతికొచ్చి రైతులను ఎంతో ఉత్సాహపరిచింది. అయితే సహజ పద్ధతులతో మన్యం ఆపిల్స్ సాగు చేయడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

2016లో షిమ్లా నుంచి ‘మైఖేల్’, ‘సెలెక్షన్’ రకాల ఆపిల్ మొక్కలను తీసుకొచ్చి సుమారు 200 మంది గిరిజన రైతులకు 100 చొప్పున అందజేశామని, రెండు సంవత్సరాల్లోనే ఆపిల్ పండ్లు కోతకు వచ్చాయని గిరిజన అభివృద్ధి సంస్థ సీఈవో నెల్లూరి సత్యనారాయణ తెలిపారు. అయితే తీపి కొద్దిగా తక్కువైనా పండ్ల నాణ్యత మాత్రం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఉత్తర భారత తోటల మాదిరిగా రసాయనాలు ఉపయోగించకుండా ఇక్కడి ఆపిల్స్‌ను పంచగవ్వ, జీవామృతం వంటి సహజ పద్ధతులతో ఇక్కడ ఆపిల్ మొక్కలను సాగు చేస్తున్నారు. దీంతో చీడ పీడలు కూడా దరి చేరవు.