18-11-2025 12:48:26 AM
‘సంధ్యా’ అక్రమ నిర్మాణాల కూల్చివేత
శేరిలింగంపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధర్‌రావు చేపట్టిన ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పలువురు ప్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, కోర్టు సూచన మేరకు హైడ్రా అధికారులు సోమవారం తెల్లవారుజామునుంచే క్షేత్రస్థాయిలో కూల్చివేతలు చేపట్టారు.
లేఔట్‌లో 20 ఎకరాల పరిధిలో 162 ప్లాట్లు ఉండగా సరిహద్దులు చెరిపి రహదారులు, పార్కులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారని బాధితులు హోకోర్టును ఆశ్రయించారు. హై డ్రా పరిశీలనలోనూ పెట్రోల్ బంక్ సహా ప లు నిర్మాణాలు పూర్తిగా అక్రమాలేనని తేలడంతో పోలీసులు బందోబస్తుతో కూల్చివేతలు ప్రారంభించారు. బాధిత ప్లాట్ యజ మానులు కోర్టులో సంధ్యా శ్రీధరరావు ఎక్కువ ప్లాట్లు కొని మిగతావారిని భయపెట్టి లేఔట్ మొత్తం తనదిగా మార్చేందుకు ప్రయత్నించారని, అడిగితే దాడులు తప్పుడు కేసుల దాకా వెళ్లారని చెప్పారు.
ఒక మహిళపై దాడి చేసినందుకు సుప్రీంకోర్టు విధిం చిన జరిమానా విషయాన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. విచారణలో జస్టిస్ విజయ్‌సేనరెడ్డి రహదారుల ఆక్రమణలను తీవ్రంగా తప్పుబట్టుతూ లేఔట్ రూ పాన్ని మార్చే ప్రయత్నాలు సహించబోవని స్పష్టం చేస్తూ, రహదారులు, పార్కుల పునరుద్ధరణ చేయాలని హైడ్రాకు సూచించారు. తుది విచారణ మంగళవారం నిర్వహించనున్నారు. హైకోర్టు సూచనల నేపథ్యంలో హై డ్రా అధికారులు రహదారులపై వేసిన షెడ్లు సరిహద్దులు దాటి జరిగిన నిర్మాణాలు అనుమతులేని కట్టడాలను వరుసగా తొలగించారు.