5 March, 2026 | 7:44 PM

రైతు భరోసా కొరకు దరఖాస్తుల స్వీకరణ

19-06-2025 12:00 AM

వ్యవసాయ అధికారి కల్పన

మంచిర్యాల, జూన్ 18 (విజయక్రాంతి) : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన రైతుభరోసా పథకానికి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన బుధ వారం తెలిపారు.

రైతు భరోసా వానాకాలం - 2025 కోసం జూన్ 5, 2025 నాటికి నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ వానాకాలం రైతు భరోసాలో నమోదు చేసుకునేం దుకు అర్హులు అని, గత సంవత్సరం దరఖా స్తు చేసుకోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇందు కోసం దరఖాస్తు ఫారం, పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం నకలు ప్రతులతో ఆయా గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులను రైతు వేదికలో సంప్రదించి ఈ నెల 20లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.