calender_icon.png 9 May, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

09-05-2025 12:00:00 AM

మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి): సెటిల్మెంట్, భూరికార్డుల కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ఆదేశాల ప్రకారం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం తెలిపారు. అభ్యర్థులు మీ-సేవ కేంద్రాల ద్వారా ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రం లో 50 రోజుల శిక్షణ ఉంటుందని తెలిపా రు.

ఇంటర్మీడియట్లో గణితంలో 60 శాతం మార్కులు సాధించినవారు, ఐ.టి.ఐ./ డ్రాఫ ట్స్ మెన్ (సివిల్)/డిప్లొమా (సివిల్)/ బి.టెక్ (సివిల్) సమాన అర్హత గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఓ.సి. అభ్యర్థులు రూ.10 వేలు, బి.సి. అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్.సి. / ఎస్.టి. అభ్యర్థులు రూ.2,500లు చెల్లించవలసి ఉంటుందన్నారు. వివరాలకు 9676993237, 9848163493 నంబర్లలో సంప్రదించాలని. ఆసక్తి, అర్హత గల అభ్యర్థు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.