09-05-2025 12:00:00 AM
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదేశాలు జారీ చేశాం
జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ మే 8 (విజయ క్రాంతి) : దేశ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మహబూబ్ నగర్ జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు తీసుకుంటూ పోలీసులకు సెలవులు రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి పలు ముందస్తు భద్రత చర్యలు చేపట్టబడ్డాయని, జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా విధుల్లో ఉంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసుల సెలవులు రద్దు చేసి 24 గంటల పాటు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకున్నాం.
ప్రజలు ఎవ్వరు కూడా అనుచిత పోస్టులు, తప్పుడు సమాచారం ప్రసారం చేయకూడదని, దేశ భద్రత, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏవైనా వ్యాఖ్యలు చేయరాదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్లు చేయడం నిషిద్ధం. సోషల్ మీడియాలో పటిష్ట నిఘా కొనసాగుతుందన్నారు. చట్టానికి లోబడి వ్యవహరించాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గుర్తింపు లేకుండా ఉన్నవారికి లాడ్జ్లలో వసతి ఇవ్వకూడదన్నారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడంలో అందరూ సహకరించాలని కోరారు.