18 April, 2026 | 3:31 AM

మహేంద్రహిల్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

14-06-2025 12:00 AM

ఘట్ కేసర్, జూన్ 13 : ఘట్ కేసర్ మున్సిపల్ అంకుశాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహేంద్రహిల్స్ లో 202526 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సుల (ప్రథమ సంవత్సరం) ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. స్నేహలత శుక్రవారం ఓప్రకటనలో తెలి పారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ), కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు మరియు దోస్త్ ఒప్పంద పత్రంతో కళాశాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులకు చివరితేదీ ఈనెల 23వ తేదీ అని మరిన్ని వివరాలకు 91210 04524, 79935 79935 సంప్రదించాలని కోరారు.