2 July, 2026 | 12:10 PM

Breaking News

స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •  

కార్పొరేట్ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులు

16-05-2025 12:08 AM

వికారాబాద్,  మే-15 కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని  షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి పి. కమాలకర్ రెడ్డి  గురువారం   ఒక ప్రకటనలో తెలిపారు.  2025 - 2026 విద్యా సంవత్సరమునకుగాను ఇంటర్మీడియట్ లో ఉచిత విద్యనభ్యసించుట కొరకు కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి ఎస్.సి. ఎస్.టి, బి.సి, మరియు మైనారిటీ విద్యార్థులు అంతర్జాలం ద్వారా   https://telanganaepass.cgg.gov.in ఈ నెల 17.05.2025 నుండి 31.06.2025 వరకు సంబంధిత దృవ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని  తెలిపారు.

ఈ అవకాశం ఏప్రిల్   2025 లో పదవ తరగతిలో ఉత్తీర్ణులు అయి GPA 7.0 ఆ పైన సాధించిన వి ద్యార్థులకు మాత్రమే అర్హత, ఇట్టి కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు, మరియు కస్తుర్బా పాఠశాలలో చదివిన  విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు.