calender_icon.png 16 May, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగృతి ఆధ్వర్యంలో ‘యువకవుల సమ్మేళనం’

16-05-2025 12:09:57 AM

-పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరుగనున్న ఈ కవి సమ్మేళన కార్యక్రమ పోస్టర్‌ను గురువారం తెలంగాణజాగృతి అధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జీవనశైలి, విశిష్టతను చాటిచెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహ, చైతన్యా న్ని పెంపొందించడానికి యువ కవుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కవి సమ్మేళనంలో పాల్గొనదలచిన కవులు, కవయిత్రు లు 35ఏళ్లలోపు ఉండాలని, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో కవితలు వినిపించవచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈనెల 26లోపు kavitha.telangana@gmail.comకు మెయిల్ చేయాలన్నారు. కార్యక్రమంలో కవుతు కాంచనపల్లి, వనపట్ల సుబ్బయ్య, జాగృతీ నాయకులు నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.