calender_icon.png 9 June, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులు

09-06-2025 02:04:15 AM

దరఖాస్తుల గడువు ఈనెల 23

ఘట్ కేసర్, జూన్ 8 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ అంకుశాపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల బుద్వేల్ నందు డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ లకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ శారద ఓ ప్రకటనలో తెలియచేశారు.

ఘట్కేసర్ అంకుశాపూర్ లో గల ప్రిన్సిటన్ ఇంజినీరింగ్ కళాశాలలో నడుపబడుతున్న బుద్వేల్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో బి ఎస్ సి ఎంపీసీ, ఎంఎస్టిసిఎస్, ఎంపిజి, ఎంఈసి, ఎంపిసిఎస్, ఎంఎస్టిడిఎస్,(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, నెట్ వర్క్ అండ్ హార్డ్ వేర్, మిషన్ లెర్నింగ్ కాంబినేషన్ లతో) ఎంసిఎస్, ఎంఏఈఎన్ హెచ్, అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ ల కొరకు వచ్చే మహిళా అభ్యర్థులు ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండి తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ. ఒక లక్ష 50 వేలు (గ్రామీణ ప్రాంతంలో) రూ. 2 లక్షలు (పట్టణప్రాంతాల్లో) ఉండాలని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఎస్ ఎస్ సి, ఇంటర్మీడియట్, మార్కుల జాబితా, బదిలీ సర్టిఫికెట్, ఆదాయ (2025 సంవత్సరంలో ఇవ్వబడినది) కుల ధృవీకరణ పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికెట్, 5 పాసుపోర్టు సైజ్ ఫోటోలతో నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చన్నారు.

అడ్మిషన్ పూర్తిగా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే ఇవ్వబడతాయని, అడ్మిషన్ పొందిన విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజన వసతి, పుస్తకాలు, నోట్ బుక్స్, స్టేషనరీ, ట్రంక్ బాక్స్ లు,  కాస్మెటిక్ చార్జెస్, ఇతర అన్ని సదుపాయాలు కల్పించబడతాయన్నారు.

విద్యార్థికి సైనిక శిక్షణతో పాటు యు పి ఎస్  సి శిక్షణ, ఇతర వృతి నైపుణ్యాలలో శిక్షణ, క్రీడలు వ్యాయామంలో శిక్షణతో పాటు ఉపాధి కల్పించడానికి వివిధ ప్రతిష్టాత్మక కంపెనీల ద్వారా ప్లేస్మెంట్ కూడా కల్పించనున్నట్లు ప్రిన్సిపాల్ శారద తెలియజేశారు. అడ్మిషన్ ల గడువు ఈనెల 23వ తేదీతో ముగుస్తుందని కావున విద్యార్థులందరూ ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.