26 August, 2026 | 7:59 PM

ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ

11-06-2024 08:13 PM

ఒడిశా : ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ను బీజేపీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. మాఝీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ తెలపారు. వీరు ఇద్దరు అధిష్ఠానం తరుపున పర్యవేక్షకులుగా హాజరయ్యారు. గత 24 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ పార్టీ తెరపడింది. మోహన్ చరణ్ మాఝీకు ఒడిశా తొలి ముఖ్యమంత్రిగా క్రెడిట్ దక్కింది. ఈ ఎన్నికల్లో కియోంజర్ స్థానం నుంచి సమీప బీజేడీ అభ్యర్థి మీనీ మాఝీనిపై 87,815 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మాఝీ ఇప్పటి వరకు 4 సార్లు ఎంఎల్ఎగా విజయం సాధించారు. 2000, 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.