రెవెన్యూ సదస్సులకు 44,741 దరఖాస్తులు
మిస్సింగ్ సర్వే నెంబర్, విస్తీర్ణ మార్పులు, చేర్పులకు ఎక్కువ దరఖాస్తులు...
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్..
సూర్యాపేట (విజయక్రాంతి): రెవెన్యూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన భూ-భారతి రెవెన్యూ సదస్సులను జిల్లాలో 18 రోజులపాటు జిల్లాలోని 22 మండలాల్లో గల 268 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించగా 44 ,741 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్(Collector Tejas Nandalal Power) తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రెవిన్యూ సదస్సులు శుక్రవారంతో ముగిశాయన్నారు.
ఈ సదస్సులో మిస్సింగ్ సర్వే నెంబర్ కు 9,032 ఇతరములకు మిగిలినవి వచ్చాయన్నారు. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు ఈ రెవెన్యూ సదస్సులో తమ దరఖాస్తులను అందజేశారన్నారు. దరఖాస్తుల పరిశీలన కొరకు శనివారం నుండి ఆగస్టు 15 వరకు అన్ని గ్రామాలకు రెవెన్యూ అధికారులు పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారన్నారు. మిగిలిన దరఖాస్తులను రైతుల వద్ద ఉన్న భూమి యొక్క డాక్యుమెంట్లను క్షేత్ర పరిశీలన చేసి పరిష్కరిస్తారని తెలిపారు.






