17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవం

22-06-2025 12:00 AM
  1. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రులు దామోదర, వాకిటి 
  2. --  5 వేల మంది విద్యార్థుల ఆసనాలు
  3. వేడుకల్లో తొక్కిసలాట, నర్సింగ్ విద్యార్థికి అస్వస్థత

శేరిలింగంపల్లి, జూన్ 21: గచ్చిబౌలి స్టేడియంలో శనివారం అంతర్జాతీయ యోగా డే ను ఆయుష్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు హాజర యాయరు. 5 వేల మంది విద్యార్థులు, యువకులు, పాల్గొని యోగాసనాలు వేశా రు.

ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు. యోగా కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని శరీరం, మనస్సు, ఆత్మను ఏకంచేసే అద్భుత సాధనమన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగా ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 630 మంది యోగా గురువులను నియమించిందని, మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. హెల్త్ సబ్‌సెంటర్లలో రోజూ ఉద యం యోగా క్లాసులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

గత ఏడాది కాలంలో కొత్తగా 5 లక్షల మందికి యోగా నేర్పించామని, అన్ని విద్యా సంస్థల్లో యోగా నేర్పించేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. నేచురోపతి, యోగిక్ సైన్సెస్‌లో పీజీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.

కాగా యోగసనాలు చేయడానికి వచ్చిన గాంధీ మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థి నజీమా గాయపడి అస్వస్తతకు గురికావడంతో నిర్వాహకులు హుటాహుటిన కొండాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య విధాన పరిషథ్ కమిషనర్ అజయ్ కుమార్ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థిని పరిశీలించారు. పరిస్థితి నిలకడగా ఉన్నదని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.