13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

108 జిల్లా మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

28-03-2026 12:05 AM

గుండాల, మార్చి 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 108 జిల్లా మేనేజర్ (ఈఎంఈ) ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యావంతుల నుండి భారీగా దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బీటెక్ మెకానికల్ పూర్తి చేసి, ఆటో మొబైల్ రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు, వైద్యశాఖ వృత్తిలో వైద్య సేవలను అందించడం, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చే విజ్ఞాన విద్యవంతులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం 9550520402 నెంబరును సంప్రదించాలని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.