23 May, 2026 | 2:21 AM

ఎంవోల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

23-05-2026 01:23 AM

మేడ్చల్, మే 22 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాల్లో బస్తీ దవాఖానాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 18 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఉమాగౌరీ తెలిపారు. మల్టీ జోన్ 2 పరిధిలో నియామకాలు చేపడతామని, అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో నమోదు కలిగి ఉండాలని తెలిపారు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులు, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో జతచేసి 26న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయాల సముదాయం, 1వ అంతస్తు, ఎఫ్1 బ్లాక్, అంతాయిపల్లిలోలో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.