4 July, 2026 | 3:39 AM

విదేశీ ఉద్యోగాల కోసం జూలై 20 వరకు దరఖాస్తులు ఆహ్వానం

04-07-2026 02:41 AM

జర్మనీ, ఒమాన్, ఖతార్, ఇజ్రాయెల్, దుబాయ్ సహా పలు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 

పెద్దపల్లి, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణ ఓవర్సీస్ మానపవర్ కంపెనీ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 2026 జూలై 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జర్మనీలో ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్/ఎలక్ట్రీషియన్, రిజిస్టర్డ్ నర్సులు, నాన్-హెల్త్ ఆస్బిల్డుంగ్, ఫిజియోథెరపిస్టులు, కమర్షియల్ వెహికల్ టెక్నీషియన్.ఒమాన్ లో ఎంబ్రాయిడరీ టైలర్, అగ్రికల్చర్ & లాండ్రీ వర్కర్లు, ఇండస్ట్రియల్ నర్సులు. ఖతార్ లో హోమ్ కేర్ నర్సులు, సివిల్ ఇంజినీర్లు, సివిల్ సూపర్వైజర్లు, కాస్టింగ్ ఆఫీసర్లు. ఇజ్రాయెల్: హోమ్ బేస్డ్ కేర్ గివర్స్, దుబాయ్ లో బైక్, టాక్సీ డ్రైవర్లు, స్టీల్ ఫిక్సర్, ఆర్సీసీ వర్కర్, టైల్ మేసన్, షట్టరింగ్ కార్పెంటర్, సివిల్ ఫోర్మన్, సివిల్ సైట్ ఇంజినీర్, హెల్పర్. జపాన్ లో హోమ్ కేర్ నర్సులు,కెనడా లో హోమ్ కేర్ నర్సులు, సౌదీ అరేబియా లో టెక్నీషియన్లు, రష్యా లో టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏసీ టెక్నీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్.గ్రీస్ లో హౌస్ కీపింగ్, వెయిటర్లు, రిసెప్షనిస్టులు, పెయింటర్లు, టైల్ మేసన్లు.మారిషస్ లో హౌస్ కీపింగ్, క్యాషియర్, షెలఫ్స్ వర్కర్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఈ ఉద్యోగాలకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు 2026 జూలై 20వ తేదీలోపు సమీకృత కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి కార్యాలయం, రూమ్ 233, పెద్దపల్లిలో సంప్రదించాలని, మరిన్ని వివరాలకు www.tomcom. telanga na. gov.in వ్బుసైట్ను సందర్శించవచ్చని, ఇతర వివరాలకు 7382452944 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు.విదేశాల్లో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.