5 August, 2026 | 2:15 PM

పలు కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ

02-09-2025 11:11 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సీనియర్ నాయకులు నల్లమోతు జానకి రామయ్య అనారోగ్యంతో బాధపడుతుండంతో మంగళవారం పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన గంట శోభనచలం,పబ్బిశెట్టి చిన్న వెంకటేశ్వర్లు,ఉప్పునూరి బక్కయ్య, పెరుమాళ్ళ రమణ ఇటీవలే మరణించడంతో వారి నివాసాలకి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

పెరుమాళ్ళ రమణ కుటుంబానికి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా రూ.5,000/- ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు తమకు అత్యంత బలమైన ఆధారమని, వారిని ఎల్లప్పుడూ అండగా నిలబెట్టుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత,రామ కొండా రెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కామిరెడ్డి పద్మ,నాయకులు మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి,కగేందర్ రెడ్డి, బత్తుల రామకొండారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.