17 April, 2026 | 11:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రెవెన్యూ సదస్సుకు జిల్లాలో 8,059 దరఖాస్తులు

25-06-2025 12:13 AM

క్షయ వ్యాధిని పారద్రోలెందుకు చర్యలు తీసుకుంటున్నాం..

జిల్లావ్యాప్తంగా 21 లక్షల మొక్కలు నాటేందుకు వ్రణాళిక సిద్ధం

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, జూన్ 24 :  భూ భారతి చట్టం అమలులో భాగంగ వనపర్తి జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా వ్యాప్తంగా 8059 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని వాటిలో ఇప్పటికే ఆరు వేలకు పైగా దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగిందని జి ల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణా రావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల నిల్వలు, ఆయిల్ పామ్ సాగు, భూ భారతి, సీజనల్ వ్యాధుల నిర్మూలన పై సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ వివరిస్తూ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేయడమే కాకుండా నోటీస్ లు జారీ చేసి దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే సమస్యాత్మక ప్రజలను గుర్తించి వారికి తేమడ పరీక్షలు నిర్వహించడం, మొబైల్ ఎక్సరే మిషన్ కొని ఎక్సరే లు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన 567 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు క్రమం తప్పకుండా వైద్యం, మందులు ఇవ్వడమే కాకుండా వారికి అంత్యోదయ కార్డులు ఇప్పించేందుకు చ ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వన మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరము వనపర్తి జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.