24 August, 2026 | 10:43 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి   •   ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం   •   నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •  

జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

25-06-2025 12:15 AM

నాగర్కర్నూల్, జూన్ 24 ( విజయక్రాంతి ) : నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల ను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ మంగళవారం ఆస్పత్రి పరిసరాలను సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు ఇతర విభాగాల ప్రొఫెసర్లు వైద్యులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్ మరమ్మత్తు కోసం అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మరుగుదొడ్లు మూత్రశాలలు పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను తనిఖీ చేశారు. వైద్యుల హాజరు, రోగులకు అందుతున్న సేవలు, మందుల సరఫరా, మౌలిక వసతులపై ఆరా తీశారు. ఐసీయూ, జనరల్ వార్డ్, డయాలసిస్ యూనిట్, ప్రయోగశాల, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్లనుపరిశీలించారు.