12 July, 2026 | 3:51 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసి దరఖాస్తులను నగరపాలక సంస్థకు అందజేయాలి

27-05-2025 12:17 AM

నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ 

కరీంనగర్ క్రైం, మే 26 (విజయ క్రాంతి): రాజీవ్ యువ వికాస దరఖాస్తుల సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసిన బ్యాంకులు సంబంధించిన దరఖాస్తులను నగరపాలక సంస్థ కు తిరిగి అప్పగించాలని నగరపాలక సంస్థ కమీషనర్ బ్యాంకర్లను ఆదేశించారు.

సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగరంలో ఉన్న వివిధ బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ బ్యాంకు బ్రాంకు బ్రాంచ్ ల వారిగా అందించిన అప్లికేషన్ల సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు.

సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసిన బ్యాంకులు తిరిగి నగరపాలక సంస్థ కు అప్లికేన్లతో పాటు దరఖాస్తు దారుల సిబిల్ స్కోర్ వివరాలను అందించాలని కోరారు. లబ్దిదారులను ఎంపిక చేసే అధికారం బ్యాంకు అధికారులకు లేదని తేల్చి చెప్పారు.

బ్యాంకు అధికారులు ఎవరు కూడ దరఖాస్తు దారులకు లోన్స్ యూనిట్స్ కేటాయిస్తామని చెప్పడం హా మీలు ఇవ్వడం లాంటివి చేయకూడదని ఆదేశించారు. డిప్యూటీ కమీషనర్ ఖాదర్ మొహియుద్దీన్, లీజ్ డిస్ట్రిక్ మేనేజర్ ఆంజనేయులు, మేప్మా పిడి వేణుమాధవ్ రెడ్డి, టీఎంసి మానస, సివోలు, బ్యాంకు అధికారులుపాల్గొన్నారు.