18 June, 2026 | 6:54 PM

ఉపకార వేతరుల కోసం దరఖాస్తు చేసుకోండి

18-06-2026 05:40 PM

నిర్మల్ జూన్ 18 ( విజయ క్రాంతి): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాల రెన్యువల్ చేసుకోవడానికి అర్హులైన విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026 27 విద్యా సంవత్సరం గాను జిల్లాలోని ప్రభుత్వ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే పదవ తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు ప్రభుత్వం త్వరలో అందించనున్న నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న పత్రాలను హార్డ్ కాపీ కార్యాలయంలో అందించాలన్నారు. అభ్యర్థులు బీసీ కుల ధ్రువీకరణ  పత్రంతో పాటు ఆధార్ ఆధార్ కార్డు,నివాస, బ్యాంకు ఖాతా నంబర్,ఆధార్ లింక్ ఉన్న వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇతర వివరాలకు శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. శాఖ కార్యాలయం లోని ఫోన్ నెంబర్ 984929 0043, నంబర్లు సంప్రదించాలన్నారు