18 June, 2026 | 7:19 PM

జిల్లా పరిషత్ హై స్కూల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన సర్పంచ్

18-06-2026 05:39 PM

కామారెడ్డి అర్బన్,జూన్ 18,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట గ్రామం లో  జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో స్కూల్ ఆవరణ గోడ నిర్మాణం మరియు టాయిలెట్ల పనులకు శంకుస్థాపన డాక్టర్ గునిగంటి .ప్రభాకర్ రావు  ఆర్థిక సాయంతో అంచన విలువ 15 లక్షలతో కూడిన పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రావు  మేనకోడలైన సురభి నిర్మల సత్యం రావు  చేతుల మీదుగా కొబ్బరికాయ  కొట్టి భూమి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ సత్య గౌడ్, పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ , తిరుపతి రెడ్డి ఉపాధ్యాయ బృందం, మరియు పాఠశాల పిటి గారు, బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ, మరియు గుండం నాగరాజ్ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది