21 June, 2026 | 1:39 AM

మహిళా మోర్చా జిల్లా అధ్యక్షుల నియామకం

21-06-2026 12:00 AM

33 జిల్లాలకు మొత్తం 34 మందిని కేటాయించిన బీజేపీ

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులను బీజేపీ నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. 33 జిల్లాలకు మొత్తం 34 మందిని నియమించారు. గోల్కొండ-గోషామహల్‌కు డాక్టర్ సురేఖ, భాగ్యనగర్-మలక్‌పేట్‌కు మంజులారెడ్డి, రంగారెడ్డి రూరల్‌కు పడమటి మమతారెడ్డి, రంగారెడ్డి అర్బన్‌కు పద్మ కేసిరెడ్డి, మేడ్చల్ రూరల్‌కు సంధ్యారెడ్డిని నియమించారు.