21 June, 2026 | 1:39 AM

ఆర్పీఐ(ఏ) నూతన కమిటీ నియామకం

21-06-2026 12:00 AM

ముషీరాబాద్, జూన్ 20(విజయక్రాంతి): రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని నియమించా రు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్గా పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధన లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం, దళితులు, బీసీలు, మైనారిటీలు, నిరుపేద వర్గా ల హక్కుల పరిరక్షణకు కృషి చేయడం, కేం ద్ర ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడం కమిటీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. జాతీయ కమిటీ సభ్యులు, రాష్ట్ర సీనియర్ నాయకుల సమ్మతితో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పి స్తూ ఈ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ నాయకత్వం తెలిపింది.