‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ భాగ్యనగర్ వార్డ్‌లో పౌరుల సమస్యల సమీక్ష
21-06-2026 12:00 AM
శేరిలింగంపల్లి,జూన్ 20 (విజయక్రాంతి):‘వన్ వార్డ్ ఎవరీ డే’ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, జోనల్ కమిషనర్ నారాయణ అమిత్,డిప్యూటీ కమిషనర్లతో కలిసి కూకట్పల్లి జోన్ భాగ్యనగర్ వార్డును సందర్శించారు.ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని హెచ్‌ఎంటీ హిల్స్, జలవాయు విహార్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలను సమీక్షించారు. భీమునికుంట చెరువు రీమోడలింగ్, సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్లు, సీవర్ క్లీనింగ్, ట్రాఫిక్ నిర్వహణ, అనధికార నిర్మాణాలపై చర్యలు, పార్కుల్లో వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.స్థానికుల సూచనలు స్వీకరించిన కమిషనర్, సంబంధిత శాఖలు త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.






