పాలేరు నియోజకవర్గంలో మండల అధ్యక్షులు నియామకం
అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
కూసుమంచి,(విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు, ఒక మున్సిపాలిటీకి అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ శనివారం అధికారికంగా ప్రకటించింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కూసుమంచి మండలానికి బజ్జూరి వెంకటరెడ్డి, తిరుమలాయపాలెం మండలానికి కొప్పుల అశోక్, ఖమ్మం రూరల్ మండలానికి తోట గోవిందరావు, నేలకొండపల్లి మండలానికి గోవిందరావు, ఏదులాపురం మున్సిపాలిటీకి బానోతు కిషోర్ ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ సందర్భంగా ఆయా మండల నాయకులు నూతన మండల అధ్యక్షులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మాపై నమ్మకంతో అధ్యక్షులుగా నియమించినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.






