టీయూ నూతన పాలకమండలి సభ్యుల నియామకం
ఈసీ మెంబెర్‌గా నిజామాబాద్ కాకతీయ విద్య సంస్థల ఎండీ చెరుకూరి రజినీకాంత్
హైదరాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ నూతన పాలకమండలి(ఈసీ) సభ్యులను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. పాలకమండలి నామినేటెడ్ సభ్యులుగా తెయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆర్.సుధాకర్‌గౌడ్, వర్సిటీ అనుబంధ కళాశాల గౌతమి పీజీ కళాశాల ప్రిన్సిపాల్ కే.సంజీవరావు, ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ దండు స్వామి,ఇందూరు పీజీ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ మదన్ మోహన్ దేవబక్తునితో పాటు పలు సామాజిక విభాగాల నుంచి చెరుకూరి రజినీకాంత్ (కాకతీయ విద్యాసంస్థలు), అల్లె లావణ్య, మహమ్మద్ ఘాజీ, ఎస్.జయంత్ లను ప్రభుత్వం నియమించింది.
పాలకమండలి క్లాస్ 1 సభ్యులుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగి తారాణా, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కళాశాల వి ద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో పాటు పాలకమండలి చైర్మన్‌గా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, కార్యద ర్శిగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి వ్యవహరిస్తారు. గత పాలకమండలి గడువు ఫిబ్రవరి 2024 ముగియగా, రెండేళ్ల రెండు నెలల సుదీర్ఘ కాలం తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం పాలకమండలి నియమించడంతో వర్సిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నూతన పాలకమండలి సభ్యులుగా నియామకమైన వారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.






