28 June, 2026 | 3:18 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

రాజ్యసభ్య సభ్యుడు నరేందర్‌రెడ్డికి అభినందనలు

17-04-2026 12:00 AM

ఢిల్లీలో ఆయన్ని కలిసిన బొమ్మినేని రవీందర్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): రాజ్యసభ సభ్యునిగా ఇటీవల ఎన్నికై, గురువారం ఢిల్లీ పార్లమెంటు భవనంలో ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి, తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఏఐ) అసోసియేట్ డైరెక్టర్ ,వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కేసముద్రము చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులైన ఓలం ఉపేందర్ పార్లమెంటు భవనంలోని రాజ్యసభ హాలులో మర్యాదపూర్వకంగా కలి సి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పార్లమెంటు రాజ్య సభ హాలులో వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రవీందర్ రెడ్డి, ఆయ నకు పుష్పగుచ్ఛం, శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడు తూ ‘సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎంపిక కావడం హర్ష ణీయం. వేం నరేందర్ రెడ్డి పార్లమెంటు రాజ్యసభలో అడుగుపెట్టడం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు గర్వకారణమని రవీందర్ రెడ్డి కొనియాడారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డిని, రాష్ట్ర ఎంపీలను, ఇతర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బొమ్మినేని రవీందర్ రెడ్డి కలిసి మాట్లాడారు.