కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
కామారెడ్డి, ఆగస్టు 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అన్నారు. సోమవారం కామారెడ్డిలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన విండో చైర్మన్, డైరెక్టర్ల అభినందన సభ, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు నూతన చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డితో పాటు డైరెక్టర్లను అభినందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని అన్నారు.కాంగ్రెస్ అంటేనే రైతులు.. రైతులు అంటేనే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు.రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన చరిత్ర ఉందని, రైతుల కష్టాలు తెలిసిన పార్టీఅని అన్నారు. రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధిలో సింగిల్ విండోలు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
కామారెడ్డి సొసైటీ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గూడెం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ సభ్యులు రైతుల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని ఆకాంక్షించారు. డైరెక్టర్లంతా సమన్వయంతో పనిచేసి సొసైటీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పిసిసి జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి , కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఉమా శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, పండ్లరాజు, గు డుగుల శ్రీనివాస్, అజ్మత్ , భరత్,ఎడ్ల రాజిరెడ్డి, రాజా గౌడ్, నవసిలాల్, రమేష్ గౌడ్, అంకం కృష్ణారావు, ఆశ బోయిన శ్రీనివాస్ , గోనె శ్రీనివాస్, భూమని బాలరాజ్, రెడ్డి నాయక్, ఇంద్రసేనారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి, మాజీ ఎంపీపీ నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.






