12 June, 2026 | 1:18 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

ఏపీఆర్జేసీ స్వర్ణోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

27-10-2025 08:23 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవం డిసెంబర్ 13, 14 తేదీలలో నాగార్జునసాగర్ విజయపురి సౌత్ లో నిర్వహిస్తున్నామని నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీ స్వర్ణోత్సవ కమిటీ బాధ్యులు, పూర్వ విద్యార్థులు సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ప్రోత్సాహం, ప్రోద్బలంతో ఈ కళాశాల స్థాపించబడిందని, గురుకుల పాఠశాలలు, కళాశాలలు స్థాపించడంలో పీవీ పాత్ర అనిర్వచనమైనదని పేర్కొన్నారు. ఇంటర్ బైపిసి, ఎంపీసీ, సిఈసి గ్రూప్ లకు చెందిన విద్యార్థులను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసి, సమాజానికి ఎంతో మంది వివిధ రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దిన ఘనత ఏపీఆర్జెసికి సొంతమని వివరించారు. 

నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీ స్వర్ణోత్సవాలలో భాగంగా డిసెంబర్ 13న గురువులకు సత్కారము, క్యాంప్ ఫైర్, 14న స్వర్ణోత్సవ సభ, ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులందరూ వీలు చేసుకొని, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మారెళ్ళ అంజిరెడ్డి, పూర్వ విద్యార్థులు సీనియర్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామక శ్రీనివాస్, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, చార్టెడ్ అకౌంటెంట్ చంచల్ అగర్వాల్, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ స్వామి, వెటర్నరీ డాక్టర్ పల్లె రాజు, డాక్టర్ గన్ను కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.