18-01-2026 12:13:43 AM
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్ జనవరి 17 (విజయక్రాంతి): సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో బిజెపి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ & మున్సిపాలిటీ ఎన్నికల విజయ్ సంకల్ప సమ్మేళనం సమావేశం హాజరైన సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఇటీవల చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తాను ముస్లిం కావడం వల్లే. అవకాశాలు రాలేదనడం తప్పుడు కామెం ట్స్ చేశారని పేర్కొన్నారు.
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందర్భంలో అభి మానులెవరూ ఆయన ముస్లిమా? హిందు వా అని చూడలేదని, మరి ఇప్పుడెందుకు? అలాంటి భేదాలుంటాయని ప్రశ్నించారు. ఏఆర్ రెహ్మాన్ లాంటి గొప్ప కళాకారుడు చేయాల్సిన కామెంట్స్ ఇవి కావని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.