calender_icon.png 19 January, 2026 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు నెలలుగా జీతాలు లేవు.. బతికేది ఎట్లా?

18-01-2026 12:11:44 AM

ఆందోళనలో ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 

19న నాచారం ఈఎస్‌ఐ హాస్పిటల్ ఎదుట ధర్నా

కుషాయిగూడ, జనవరి17, (విజయక్రాంతి): ఈఎస్‌ఐ హాస్పిటల్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న యాక్టివిటీ ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నర్సింగ్ స్టాఫ్ ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు ల్యాబ్ టెక్నీషియన్స్ సెక్యూరిటీ గార్డ్ శానిటేషన్ వర్కర్ డ్రైవరు లు ఎలక్ట్రిషన్లు తదితరు రంగాలలో ఈఎస్‌ఐ హాస్పిటల్ లో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2000 మంది ఈఎస్‌ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ రామచంద్రాపురం సిర్పూర్ కాగజ్ నగర్ ఆయా డిస్పెన్సరీలో పనిచేస్తున్న  వీరికి కనీస వేతనాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. పిల్లల ఫీజులు కట్టలేక అద్దె కిరాయి లు చెల్లించలేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితిలో  బతుకు బండి లాగలేక ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆర్థికం గా చితికిపోయి ఆత్మహత్యలకు పాలు పడుతున్నారు.

యాక్టివి ఉద్యోగులకు 12 వేల రూపాయలు నెల జీతం.. ఈఎస్‌ఐపిఎఫ్ కటింగ్ గాక వీరి చేతికొచ్చేది పదివేల రూపాయలు మాత్రమే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 15 వేలు  ఈఎస్‌ఐ పిఎఫ్ కటింగ్ గాక వీరి చేతికొచ్చేది పదివేల రూపాయలు మాత్రమే పక్క రాష్ట్రాలలో  నేరుగా ప్రభుత్వమే ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏజెన్సీల ద్వారా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు యాక్టివేట్ ఉద్యోగులకు 2000 మంది ఉద్యోగులకు ఏజెన్సీ ద్వారా అంటే కాంట్రాక్టీకరణ ద్వారా జీతాలను ప్రతినెల 10 తారీకు వరకు జీతాలు చెల్లిస్తుంటారు. నాచారం ఈఎస్‌ఐ హాస్పిటల్లో ఎస్‌ఆర్ ఆర్ ఎంట్ర్పజెస్ ద్వారా జీతాలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్నారు. ముఖ్యం గా ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లించాలని రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు యాక్టివిటీ ఉద్యోగులు ప్రభుత్వానికి అర్జీ పెట్టు కుంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  గత ఆరు నెలల నుండి జీతా లు చెల్లించడం లేదని మాకు మా జీతాలు చెల్లించి మాకు న్యాయం చేయగలరని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. జీతా లు చెల్లించాలంటూ ఈనెల 19న నాచారం ఈఎస్‌ఐ హాస్పిటల్ ఎదుట ధర్నా చేస్తామని తెలంగాణ మెడికల్ కాం ట్రాక్ట్ ఎం ప్లాయిస్ యూనియన్ కార్యదర్శి లింగమ్మ డిప్యూటీ సెక్రటరీ క్రాంతి కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.. మాకు జీతాలు పెంచాలని ప్రతి నెల ఒకటో తారీకు వరకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఆయా కార్మిక సంఘాలు ఆందోళనలో పాల్గొనడం జరుగుతుందని ఆయా కార్మిక సంఘాలు తెలిపాయి ఇప్పటికే నాచారం ఈఎస్‌ఐ హాస్పిటల్ మెడికల్ పర్యవేక్షణ అధికారి కి వినతి  పత్రాన్ని అందజేశారు.