18-01-2026 12:49:15 AM
మేడారం, జనవరి 17 (విజయక్రాంతి): మేడారం గ్రామంలో సమ్మక్క దేవత కొలువై ఉండే చిలకలగుట్ట నుంచి నిరంతరం జాలువారే జలధార మహా మహి మాన్వితంగా భక్తులు చెప్పుకుంటారు. మండు వేసవిలో సైతం గుట్ట పొరల్లో నుండి జాలువారే జలధార నీటిని మహిమాన్వితంగా భావిస్తారు. జాతర సమయంతో పాటు మేడారం వచ్చిన భక్తులు ఈ నీటిని తాగితే వ్యాధులు నయమవుతాయని నమ్మిక. అలాగే జలధార నీటిని సీసాల్లో ఇంటికి తీసుకువెళ్తారు.