టీ తాగుతున్నారా..?
వర్షాకాలం, చలికాలం, వేసవి కాలం అంటూ తేడా లేకుండా సమయంతో సం బంధం లేకుండా చాయ్, కాఫీలు తాగడం ఆధునిక జీవితంలో చాలా మాములైపోయింది. కొందరు కాలేజ్‌లో, ఆఫీస్‌లో ఫ్రెండ్స్‌తోనో చాయ్ తాగుతుంటారు. మరికొందరు ఒత్తిడి నుంచి ఉపశమనానికి తాగుతుంటారు. అయితే చాయ్ కానీ కాఫీ కానీ ఎప్పుడు తాగాలో ఎప్పడు తాగకూడదో ఈ మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసోర్సెస్(ఐసీఎమ్‌ఆర్) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం...
మనం తాగే చాయ్, కాఫీలలో కెఫిన్ ఉం టుందని అందిరికి తెలిసిన విషయమే అయి తే రోజుకు 300 ఎమ్‌జీ కంటే ఎక్కువ కెఫిన్ ఒక వ్యక్తి తీసుకోకూడదని ఐసీఎమ్‌ఆర్ తెలిపింది. అంతేకాకుండా చాయ్, కాఫీలో ఉండే టానిన్లు ఐరన్‌ను గ్రహించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తాయని హెచ్చరించింది. భోజనానికి ముందు తర్వాత కనీసం గంట పాటు చాయ్, కాఫీని తాగకూడదని పేర్కొంది.
ఇది రక్తహీనతకు దారి తీస్తుంది. కాఫీ ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, హృదయ సం బంధిత సమస్యలలాంటివి తలెత్తుతాయని చెప్పుకొచ్చింది. కాబట్టి వేళపాల లేకుండా చాయ్, కాఫీలు తాగేకన్నా ఎప్పుడో ఒకసారి తాగడం ఉత్తమం. ఈ కల్తీ ప్రపంచంలో మొత్తానికి తాగకపోవడం కూడా మంచిదే.. ఏదైనా వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది.






