22 April, 2026 | 10:39 PM

మేము చేసిన అభివృద్ధిపై మీ గొప్పలా?

09-12-2024 12:39 AM
  1. కేసీఆర్ విజన్‌తోనే యాదాద్రి పవర్ ప్లాంట్
  2. సర్కారుపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం

నల్లగొండ, డిసెంబర్ 8 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ విజన్‌తో చేపట్టి తుది దశకు చేర్చిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, బీఆర్‌ఎస్ నల్లగొండ పట్టణాధ్యక్షుడు దేవేందర్ తో కలిసి ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సోయిలే దన్నారు.

జేబులు నింపుకునే వారికి అభివృద్ధి అంటే ఏం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలోనే పెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మా ణం ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నా రు. కేసీఆర్ కృషి, పట్టుదలతోనే పవర్ ప్లాంట్ నిర్మా ణం తుది దశకు చేరిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే శని అని, కాంగ్రెస్ హయాంలోనే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ విజృంభించిందని ఆక్షేపించారు.

ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపేందుకే కేసీఆర్ మిషన్ భగీ రథకు శ్రీకారం చుట్టారన్నారు. నల్లగొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి కోమటిరెడ్డి మతిస్థిమితం కోల్పో యి మాట్లాడారని, నాడు బీఆర్‌ఎస్ హ యాంలో యాదాద్రి ప్లాంట్‌ను కూల్చేస్తామని ప్రగల్భాలు పలికిన కోమటిరెడ్డికి ఇప్పుడు బుద్ధొచ్చి కిక్కుమనడం లేదన్నారు.

నాటి నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో కోమటిరెడ్డి ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నల్లగొండలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మెడికల్ కళాశాల భవనం నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభు త్వం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం ఉద్యోగా లను సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు.