ప్రమాణస్వీకారోత్సవంలో జేబు దొంగలు
25 మంది వద్ద రూ.5 లక్షల చోరీ
మహబూబాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క తోపాటు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయి తే ఈ కార్యక్రమంలో జేబుదొంగలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు కాజేశారు. సుమారు 25 మంది వద్ద రూ.5 లక్షల పైగా దోచుకున్నట్లు తెలుస్తోంది.
సీరోలు మండలం కోత్తూరు(సి) గ్రామానికి చెందిన చిట్టూరి లక్ష్మినారాయణ జేబులో నుంచి రూ.50 వేలు, అదే మండలం రేకులతండాకు చెందిన తేజావత్ బాలక్రిష్ణ నుంచి రూ.15 వేలు, మహబూ బాబాద్ పట్టణానికి చెందిన తేజావత్ చిరంజీవి నుంచి రూ.12వేలు, మహబుబాబాద్ మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి నుంచి రూ.10 వేలు, ఇంకొకరి నుంచి రూ.23 వేలు... చోరీ చేశారు.
దీంతో పదుల సంఖ్యలో బాధితులు మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టి ఫిర్యా దు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ దీక్ష వేదిక వద్ద కూడా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు.






